తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం దేవపూర్ మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్ శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా శాగంటి రమేష్ (మాజీ ఎంపిటీసీ) మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటూ జాగృతి బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలలో జాగృతి కీలకమైన పాత్ర పోషిస్తుందని ధీమా...