చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం దేవపూర్ మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్ శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా శాగంటి రమేష్ (మాజీ ఎంపిటీసీ) మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటూ జాగృతి బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలలో జాగృతి కీలకమైన పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీనా చారి, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు మేక లలిత యాదవ్, ఆదిలాబాద్ జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

