Chitram news
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 3:19 pm Editor : Chitram news

సోయాబీన్ రైతుల సమస్యలపై  వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు  పాయల్ శంకర్, రామారావు పటేల్

చిత్రం న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో గురువారం హైదారాబాద్ లో బీజేపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఎమ్మెల్యేలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.