చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 24 భాగ్యనగర్ లో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల కింద ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ యార్డ్ లో (క్రోమ్ తోలు జిన్నింగ్ వాషర్) పనికిరాని చెత్తను పారేసి దాన్ని తగలబెడుతున్నారు, తగలబెట్టిన తర్వాత దాని నుండి వచ్చే హానికరమైన పొగతో వాయు కాలుష్యమై, భాగ్యనగర్, తాటిగూడలో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

