Chitram news
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 9:59 pm Editor : Chitram news

మేడిగూడకు రూ.కోటి నిధులు కావాలని శివప్రసాద్ రెడ్డి విన్నపం..స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ(ఆర్) గ్రామానికి నిధులు మంజూరు చేయాలని క్యాతం శివప్రసాద్ రెడ్డి విన్నపానికి సీఎం రేవంత్ రెడ్డి  స్పందించారు. తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామాభివృద్ధికి రూ.కోటి  నిధులు మంజూరు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.  మేడిగూడ గ్రామానికి 50 ఇందిరమ్మ ఇళ్లు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఏకబిల్వ శివాలయం, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేయాలంటూ గ్రామ ప్రజల తరపున ఆయన సీఎంకు లేఖ ద్వారా విన్నవించారు. ఈ నెల 30న స్పందించిన సీఎం  రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేసింది. కలెక్టర్ గ్రామాభివృద్ధి విషయమై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో ను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శివ ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.