Chitram news
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 6:28 pm Editor : Chitram news

ఆదిలాబాద్‌లో న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు_జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 15 ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, రేసింగ్ వంటి నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయిని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించి సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలను ఆయన కోరారు.