ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
_జిల్లా కలెక్టర్ రాజర్షి షాని కోరిన నేతలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తున్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను సంబంధిత యాజమాన్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే నేతల బృందం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ లను కలిసి జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో వినతి పత్రం సమర్పించారు. జనవరి మూడో తేదీన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని రాష్ట్ర పండగగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మాలీ మహా సంఘం, హిందీ భాష సేవా సమితి కార్యవర్గ సభ్యులు కార్యక్రమ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని అన్ని యాజమాన్యాల పాఠశాల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేలు స్త్రీ విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషిచేసిన మహోన్నత వ్యక్తులని వారి సేవలను స్మరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను ఏర్పాటుచేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారిని సంఘం నేతలు కోరారు. వారిని కలిసిన వారిలో మాలే మహ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలే, హిందీ భాషా సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ ప్రధాన్, సంయుక్త కార్యదర్శి అనిల్ కోట్రంగే తదితరులు ఉన్నారు.
