Chitram news
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 3:40 pm Editor : Chitram news

మూగజీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు వైద్యాధికారి డా.రాజేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను వేశారు.అనంతరం పశు వైద్యాధికారి మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న పశువులతో పాటు మేకలు, గొర్రెలు వ్యాధిన పడ్డ వాటిని గ్రహించి యజమానులు వెనువెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని, ఎప్పటికప్పుడు పశువులను శుభ్రంగా ఉంచితే సమృద్ధిగా పాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్ పటేల్, ఉప సర్పంచ్, పురుషోత్తం, పశువైద్య సిబ్బంది, జేవీఓ సుజాత. గోపాలమిత్ర గణేష్ ఓఎస్ వినాయక రావు, రైతులు హల్దేకర్ గోపి, కాలేవార్,దిగంబర్, గోవింద్, దశరథ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.