విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి
చిత్రం న్యూస్ బేల : బేల మార్కెట్ యార్డు లో 45 రోజుల నుంచి రైతులు పడుతున్న కష్టాలు, కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ లకు కనిపించడం లేదా అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి ధ్వజమెత్తారు. బేల మార్కెట్ యార్డు లో కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడం తో మేము తప్పు చేశాం…మార్కెట్ కు సోయా తీసుకొచ్చి తప్పు చేశాం అని మోకాళ్ళ పై కూర్చొని రైతులు నిరసన తెలపడంతో స్పందించిన ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కరోనా సమయంలో కూడా ఇంటింటికి వచ్చి కొనుగోళ్లు చేసిన ఘనత కేవలం బీ ఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి దక్కిందన్నారు. అసెంబ్లీలో మొసలి కన్నీళ్లు కార్చి రైతుల పక్షాన ఉన్నామనుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి బేల రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులు రాత్రి అనగా పగలు అనగా కష్ట పడి పండించిన పంట చివరకు అమ్ముకుందాం అనుకుంటే పంట కొనుగోలు చేసే మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు చేసిన నాణ్యమైన సోయా బస్తాలు వెనుకకు రావడం తో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతులు పడుతున్న కష్టాల పై రెండు రోజుల్లో రైతుల తో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ చేపడుతున్నామని రాబోయే రోజుల్లో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని. రైతులకు భరోసా కల్పించారు. ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పంటలు కొనుగోలు చేయించాలని, లేనియెడల రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, జక్కుల మధుకర్, సతీష్ పవార్, మస్కే తేజరావు, సురేష్ రెడ్డి, ఠాక్రే అనిల్ తదితరులు పాల్గొన్నారు.
