చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, బేల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బేల తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్ తో కలిసి సోమవారం అవాల్ పూర్, పిట్ గావ్ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలనలో లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, మహిళలకు బస్సు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇలా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్, బాది సర్పంచ్ వినోద్, బేల మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, మాజీ ఉప సర్పంచ్ అనిల్, వార్డ్ మెంబర్ సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
