చిత్రం న్యూస్, బేల: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ చేపట్టి శివాజీ చౌక్ అంతర్జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ్ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ పలు ఇతర దేశాలలో హిందువులపై పైౖశాచికంగా ఉన్మాది చర్యలకు పాల్పడడం హేయమన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ యువకుడిని పెట్రోల్‌పోసి తగలబెట్టడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని ఐక్యంగా ఉంటూ ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్,బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు అగర్కార్ ఆకాష్ ,నాయకులు పొత్ రాజ్ నవీన్, రాము బర్కాడే, ప్రఫుల్, గేడం ప్రవీణ్, ఓం ప్రకాష్, తరుణ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు

