ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలుకుతున్న లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. శుక్రవారం విమానాశ్రయ మైదానాన్ని, ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆది భోజారెడ్డితో కలిసి ఆయన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.