ఆదిలాబాద్ లో డీసీసీ కార్యాలయం ప్రారంభం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవితేజ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ డిసీసీ...