చిత్రం న్యూస్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో బాజీరావ్ మహారాజ్, సద్గురు శ్రీ శబరి మాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పాల్గొని పల్లకీ మోశారు. గ్రామస్తులతో కలసి నృత్యం చేసి చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రియాంక, గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
