కడెం మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సంపత్ రెడ్డి
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడితో పాటు మండల కమిటీని ఉప సర్పంచ్‌లు ఎన్నుకున్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సమావేశంలో కొండుకూర్ గ్రామ ఉప సర్పంచ్ పొద్దుటూరి సంపత్ రెడ్డిని కడెం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా లింగాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కమ్మల లక్ష్మిని, గౌరవ అధ్యక్షురాలిగా నాగవత్ సరితను ఎన్నుకున్నారు. ప్రధాన...