యూరియా బస్తాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెకారు. ఆందోళన చేపట్టారు. మండలంలోని పెద్దూర్, ధర్మాజీపేట్, మద్దిపడగా, చిట్యాల, పాండ్వాపూర్, బిల్లాల్, కొండుకూర్, కన్నాపూర్ రైతులంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..ఎకరానికి ఒక బస్తా కూడా ఇవ్వడం లేదని.. ఎప్పుడు వచ్చినా సర్వర్ ప్రాబ్లం అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి...