జైనథ్ బాజీరావుబాబా మహారాజ్ మందిరానికి మైక్ సెట్ విరాళం
చిత్రం న్యూస్,జైనథ్: జైనథ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చి ఓటమి చెందిన కూడా గ్రామస్థులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, సర్పంచ్ అభ్యర్థి నవీన భర్త బీజేపీ యువ నాయకులు చిలుకూరి లింగా రెడ్డి గ్రామంలోని బాజీరావు బాబా మహారాజ్ మందిరానికి మైక్ సెట్‌ను విరాళంగా అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, తన విశ్వసనీయతను చాటుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సమయంలో లింగా రెడ్డి బాజీరావుబాబా మందిరానికి అవసరమైన మైక్ సెట్‌ను అందజేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ మేరకు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో మైక్ సెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం, కానీ వాటిని నెరవేర్చడం అరుదు. చిలుకూరి లింగా రెడ్డి తన మాటను నిలబెట్టుకుని, యువతకు ఆదర్శంగా నిలిచారు,” అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విరాళం ఆలయంలో జరిగే కార్యక్రమాలకు, ప్రార్థనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

