Chitram news
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 2:48 pm Editor : Chitram news

ఎల్లమ్మ ఆలయంలో ముడుపు మౌనిష్ రెడ్డి పూజలు

ఎల్లమ్మ ఆలయంలో ముడుపు మౌనిష్ రెడ్డి పూజలు

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం లోని పూసాయి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ తల్లి జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.గ్రామంలోని మహిళలు అంతా డప్పుచప్పుల్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారివెంట గ్రామస్తులు బుర్రి శాలిక్, బుశెట్టి గంగాధర్, ఉద్దే సంజీవ్, గంగం సురేందర్ రెడ్డి, బుద్దె రాజన్న, ఇస్తారీ, బుర్రి సంతోష్, నవీన్ తదితరులు ఉన్నారు.