చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి కొనుగోళ్లపై కీలక ప్రకటన వెలువడింది. పత్తి నాణ్యతా ప్రమాణాలు తగ్గడంతో, భారత పత్తి సంస్థ (CCI) కొనుగోలు ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 22, 2025 సోమవారం నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. వివరాలు:
ధర తగ్గింపు: ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న BB SPL MOD రకం పత్తి ధర నుండి MECH MOD రకానికి మారుస్తూ, క్వింటాలుకు రూ. 8,010 (రూ.50 తగ్గింపుతో )చొప్పున కొనుగోలు చేయనున్నారు.
కారణం: మార్కెట్‌కు వస్తున్న పత్తి శాంపిళ్లను ల్యాబ్‌లో పరీక్షించగా, పత్తి పింజ పొడవు (Staple Length) 27.5 MM నుండి 28.5 MM కన్నా తక్కువగా ఉన్నట్లు మరియు మైక్రోనీర్ వాల్యూ 3.5 నుండి 4.7 ఉన్నట్లు CCI అధికారులు గుర్తించారు. ఇది వారి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు సూచన: రైతులు తమ పత్తిలో కౌడి, రంగు మారిన పత్తిని కలపకుండా వేరు చేసి, నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రైతులను కోరారు.పత్తి నాణ్యత తగ్గడంతో ధర తగ్గింపు -క్వింటాలుకు రూ.50 కోత

