ఆదిలాబాద్‌లో చలి తీవ్రత: పాఠశాలల సమయాలు మార్పు
ఆదిలాబాద్‌లో చలి తీవ్రత: పాఠశాలల సమయాలు మార్పు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో విద్యార్థుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా పాఠశాలల పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, అన్ని విద్యా సంస్థలకు (ప్రాథమిక, యూపీఎస్ & హైస్కూల్స్) తక్షణమే వర్తించేలా కొత్త సమయాలను ప్రకటించారు....