ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దాని ఆత్మ, స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో...