Chitram news
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 5:21 pm Editor : Chitram news

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దాని ఆత్మ, స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి  పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు బిగిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చట్టంలో మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఇప్పటికీ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ కుంటిసాకులు చెబుతున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కేంద్రం తన అవసరాలకు వినియోగిస్తోందని ఆరోపించారు. సెస్ ల  పేరుతో రాష్ట్రాలను దోచుకుంటూ 40 శాతం భారం రాష్ట్రాలపై మోపుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ  మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, టౌన్ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, నాయకులు వాసిం రంజాని, అడేళ్లు, వాసిం, అసిఫ్, మోసిన్, దోసలి సంతోష్, అలీం , రొడ్డ ప్రదీప్, ఫహీమ్, గంగన్న, ఆరే గంగన్న,రవి, రహీం, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.