Chitram news
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 12:40 pm Editor : Chitram news

ఉప సర్పంచ్ ముబీన్ ను సన్మానించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్

*దంతన్ పల్లి గ్రామ చరిత్రలోనే మొదటి మైనార్టీ ఉప సర్పంచ్ ముబీన్

చిత్రం న్యూస్, ఉట్నూర్: మొదటి విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన మొహమ్మద్ ముబీన్ ను  మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు మజర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మజర్ మాట్లాడుతూ.. దంతన్ పల్లి గ్రామ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా మైనార్టీ ఉప సర్పంచ్ కావడం గొప్ప విషయమని, ఇది మైనార్టీలు గర్వపడే విషయమని అన్నారు. 400 ఓట్లు గల దంతన్ పల్లి గ్రామంలో ఎన్నో ఏండ్ల నుంచి మైనార్టీలకు అవకాశం రాలేదని, సేవ చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించుకుని ముబీన్ చరిత్ర సృష్టించారని అభినందించారు.