Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బోథ్ న్యూ కాలనీలో ఓటరు  వినూత్న ప్రయత్నం

బోథ్ న్యూ కాలనీలో ఓటరు  వినూత్న ప్రయత్నం

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలో  గతంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ 15వ వార్డు సమస్యలను పట్టించుకోలేదని బిలాల్ దుకాణ యజమాని అజీమ్ ఆరోపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అభ్యర్థులకు తన కాలనీ సమస్యలను స్పష్టంగా ఒక ప్లకార్డు మీద వ్రాసి చూపిస్తూ, “గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తాం” అని హామీ తీసుకుంటున్నారు. ఆ హామీపై అభ్యర్థుల సంతకాలు తీసుకుంటూ ప్రత్యేక హామీ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత హామీ నెరవేర్చకపోతే.. వారి సంతకంతో కూడిన ఆ హామీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో పోరాటం చేస్తానని అజీమ్ స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఓటర్లు ఈ విధంగా బాధ్యతాయుతంగా ముందుకు రావడం కాలనీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments