Chitram news
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 8:16 am Editor : Chitram news

రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్

రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, జైనథ్: అదిలాబాద్ జైనథ్ మండలం లక్ష్మీపూర్ లో శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. రెండో విడత ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రజలను సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్ట్ పెట్టిన, గ్రామాల్లో రెచ్చే గొట్టేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బేల మండలంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడిపై 67 ఐటి యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రావణ్ కుమార్, బేల, జైనథ్ ఎస్ఐలు ప్రవీణ్, గౌతం పాల్గొన్నారు.