జైనథ్ లో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జైనథ్ మండల తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో సుధీర్ కుమార్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో మండల ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ సేవలు లభ్యం కావడంతో ప్రజలు సులభంగా ఆధార్ నమోదు, అప్‌డేట్ వంటి సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుగు సురేందర్, సయ్యద్ సర్ఫరాజ్, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కేంద్రం యొక్క సంప్రదింపు నంబర్: 9441614474.
