*కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగమల్యాల్ గ్రామస్తులు
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నాగమల్యాల్ గ్రామస్తులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. అభివృద్ధి చూసి కాంగ్రెస్ లో చేరుతున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని అధికార పార్టీతో కలిసి మా ఊరును అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. గత 10 సం.. నుండి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందని, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నాగమల్యాల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచిలు భీముడు, నారాయణ, గ్రామపటేళ్లు గంగారాం,తోట గంగాధర్ గంగారాం, యువ నాయకులు మహేందర్. మండల అధ్యక్షులు ఆడే వసంతరావు రావు కుంటాల మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, బానోత్ వసంత్, జాదవ్ కపిల్ దేవ్,ఆడే రమేష్, వసంతరావు,ఎండి సద్దాం, మౌలానా,గజ్జల అశోక్,గట్టుఅశోక్, సంతోష్, దేవేందర్,లక్ష్మణ్,నాయకులు గ్రామస్తులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
