Chitram news
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 12:38 pm Editor : Chitram news

త్వరలో  ప్రేక్షకుల ముందుకు “ఆస్కార్ మిస్సింగ్” సినిమా

చిత్ర న్యూస్, ఫిల్మ్ నగర్: ఆస్కార్ అవార్డ్ మిస్సింగ్ అనే టైటిల్ తో ఆస్కార్ అవార్డ్ చుట్టూ  తిరుగుతూ మంచి కామెడీ జోనర్‌లో అందరిని నవ్వించాడనికి ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా  వరంగల్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  త్వరలో షూటింగ్ పూర్తిచేసి, ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని సినిమా విడుదలకు సిద్ధం కాబోతుంది. ఇందులో హీరోగా ఆర్ కే మాస్టర్, హీరోయిన్ గా అయేషా టాకియా, నటులు అలీ ,చలాకీ  చంటి, గడ్డం నవీన్, మంగళవరం ఫేమ్ లక్ష్మణ్, పుష్ప ఫేమ్ కేశవ, ఇంకా జబర్దస్త్ టీమ్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వినయ్ నిర్మాత కాగా పీ ఆర్ వో వికాస్. ఆర్ కే మాస్టర్ (రాధా కృష్ణ) నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.