ఇందిరమ్మ ఇళ్ల పేరిట జోరుగా ఇసుక వ్యాపారం
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుక వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక అనుమతి పత్రంతో పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల తరలిస్తున్నారు. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న వ్యాపారులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము...