Chitram news
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 11:15 am Editor : Chitram news

ఇందిరమ్మ ఇళ్ల పేరిట జోరుగా ఇసుక వ్యాపారం

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల  లబ్ధిదారుల పేరిట ఇసుక వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక అనుమతి పత్రంతో పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల తరలిస్తున్నారు. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న వ్యాపారులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బేల మండలంలోని కాంగార్ పూర్ పెన్ గంగా నుంచి ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణ జరగుతోంది. అక్రమ రవాణ చేస్తున్న ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకుంటున్న ఆయా శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు ఒక ట్రాక్టర్ కి కేవలం వారం రోజులు పర్మిషన్ ఇవ్వాలి కానీ తహసీల్దార్ కార్యాలయంలో రాబోయే నెలకు కూడా ముందస్తుగానే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రఘునాథ్ రావ్ ను వివరణ కోరగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పేరుతో వ్యాపారం చేసిన వారిపైన చట్యరిత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి వారి పైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మీదట రాత్రి పూట తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.