Chitram news
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 5:30 pm Editor : Chitram news

జైనథ్ మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు!

ఎస్టీ(2), ఎస్సీ(3), బీసీలకు(3) కేటాయింపులు, (9) జనరల్ స్థానాలు

చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో సర్పంచ్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా దాదాపుగా ఖరారయ్యాయి. మొత్తం 17 స్థానాలకు కేటాయింపులు జరిగాయి. ఈ రిజర్వేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి:

ఎస్టీ (ST) – 2 స్థానాలు: బెల్గాం: మహిళా జనరల్, మాకోడ: జనరల్

ఎస్సీ (SC) – 3 స్థానాలు: బహదూర్ పూర్: జనరల్, కరంజి కె.: మహిళ  కాప్రి: జనరల్

బీసీ (BC) – 3 స్థానాలు: లక్ష్మీపూర్: జనరల్, కంఠ: మహిళ, సాంగ్వి కె.: జనరల్

జనరల్ స్థానాలు (9):  అడ: జనరల్ మహిళ, దీపాయిగూడ: జనరల్ మహిళ, జైనథ్: జనరల్ మహిళ, కౌట: జనరల్ మహిళ, ఆకుర్ల: జనరల్, బెల్లూరి: జనరల్,  కూర: జనరల్, నిరాల: జనరల్, పిప్పల్ గావ్: జనరల్.

ఈ విధంగా మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు దాదాపుగా ఖరారు అయినట్టే. గతంలో (2019 ఎన్నికల్లో) రిజర్వు చేసిన స్థానాలను రొటేషన్ విధానం ప్రకారం మార్చాల్సినందున.. పాత జాబితాను నిశితంగా పరిశీలిస్తూ తాజాగా స్థానాలను కేటాయించారు. రిజర్వేషన్ల నిర్ధారణలో ఈసారి బీసీ కేటగిరీకి సంబంధించిన కోటాలో కీలకమైన మార్పు జరిగింది. గత సెప్టెంబరులో ప్రాథమికంగా ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల జాబితాలో బీసీ కేటగిరీకి 42% స్థానాలు కేటాయించారు. తాజాగా పూర్తి చేసిన కసరత్తులో.. బీసీ కేటగిరీ స్థానాలను 22.3 శాతానికి తగ్గించారు. దీనివల్ల బీసీలకు కేటాయించాల్సిన మిగిలిన 19.7 శాతం సీట్లను జనరల్ కేటగిరీ కిందకి మార్చారు. ఈ కసరత్తులో భాగంగా మహిళా రిజర్వుడు స్థానాలను ఎంపిక చేసి, మొత్తం తుది జాబితాను ఖరారు చేసారు. ఆ తర్వాత వెంటనే, జిల్లాల వారీగా నిర్ధారణ అయిన రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలి కార్యాలయానికి పంపిస్తారు. అయితే..ఈ రిజర్వేషన్ల జాబితా ఇప్పుడే అధికారికంగా విడుదల కాదు. ఈ నెల నవంబర్ 24న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ తర్వాత రోజు.. నవంబర్ 25న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్లపై మరోసారి కసరత్తు చేసి అధికారికంగా తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహులంతా హైకోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం, తుది రిజర్వేషన్ల జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మెుత్తంగా డిసెంబర్ తొలివారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.