చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం మంజూరు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు అన్నారు. సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 29 ఇళ్ళు మంజూరు చేశారన్నారు. రానివారు నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందజేస్తామన్నారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారు దివ్య_వెంకట్ రెడ్డి దంపతులను సన్మానించారు. నాయకులు అల్చేట్టి నాగన్న, షకీల్, ఎం.ఏ ఖయ్యూం, స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, క్యాతం శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిట్యాల భూమన్న తదితరులు పాల్గొన్నారు.

