*ఆర్థిక నేల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
*రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి
*పాత నేరస్తులపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి
*అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి
*గంజాయి, మాదకద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్మూలించాలి
చిత్రం న్యూస్, బోథ్ : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సీఐ గురు స్వామి ఎస్పీకి పూల మొక్క అందజేశారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎటువంటి మాదకద్రవ్యాలకు ఆస్కారం లేకుండా గంజాయి లాంటి వాటిని పూర్తిగా నిర్మూలించే దిశగా కృషి చేయాలని, గంజాయి పండించిన, వ్యాపారం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. వీపీఓ విధానం ద్వారా సమాచార సేకరణ మరింత సులభంగా.. ప్రజలకు పోలీసు వ్యవస్థ దగ్గరవుతుందని తెలిపారు. పాత నేరస్తులు రౌడీ షీటర్ ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలనన్నారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి కేసుల దర్యాప్తు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. నేరస్థులకు శిక్షలు పడిన సందర్భంలో పోలీసులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తుందని ప్రజలలో విశ్వాసం నమ్మకం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురు స్వామి, ఎస్సై లు సాయికుమార్, జి సంజయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

