చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ “సిరిసిల్ల రాజయ్య”ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కలిశారు. బుధవారం ఉదయపు నడకకు వచ్చిన ఆయన్ను కలిశారు. ఆదిలాబాద్ లో జడ్పీ సీఈవోగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా ముచ్చటించారు. వీరి వెంట డేరా కృష్ణారెడ్డి, మేకల మల్లన్న తదితరులు ఉన్నారు.

