చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పదో తరగతి విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన ₹125 ఎగ్జామ్ ఫీజు బదులు ₹700 నుండి ₹1000 వరకు వసూలు చేస్తున్నాయని AISF మండల అధ్యక్షుడు మున్సిఫ్ ఆరోపించారు. ఈ అంశంపై బోథ్ ఎంఈఓ కు AISF ప్రతినిధులతో కలిసి మంగళవారం మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతూ, అన్యాయంగా అధిక ఫీజులు వసూలు చేయడం దోపిడీగా పేర్కొన్నారు. ఈ అన్యాయ వసూళ్లపై వెంటనే తనిఖీలు జరిపి, సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.కార్తీక్, L.నరేష్, R.ప్రేమ్ పాల్గొన్నారు.
