తెలంగాణకు చలి హెచ్చరిక: రాబోయే పది రోజులు గజగజే!
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 11 నుండి 19 వరకు, ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17 మధ్య కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా బలమైన శీతల వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇది గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 8 నుండి 10 రోజుల పాటు చలి...