చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు సముచిత న్యాయం కలిపించాలనే ఉద్దేశ్యంతో ప్రజా ప్రభుత్వంను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు, నిరుపేద ప్రజలకు, మహిళలకు అందరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేరేలా ఆయన ఒక ఆశా కిరణంల వచ్చారని కొనియాడారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో ఇరవై ఏండ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, వామన్ వాంకడే, నాయకులు ఘన్ శ్యామ్ గవండే, సుదాం రెడ్డి, రూప్ రావు వాంఖడే, అడే శంకర్, గేడం మాదవ్, చంద్రకాంత్, కన్నె రాజు, అవినాష్ ఖడ్సే, ఘన్ శ్యామ్ గోడే, రమేష్ పటేల్, భీo రావ్, యువజన నాయకులు అవినాశ్ గోడే, సాగర్ థాక్రే, శంకర్ భోక్రే, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
