మశాల (బి)లో “పోలీసులు మీకోసం” కార్యక్రమం
చిత్రం న్యూస్, బేల: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని మశాల (బి)లో సైబర్ క్రైమ్ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గ్రామంలో ...