కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవం
చిత్రం న్యూస్, హైదరాబాద్: కోకాపేట్‌లోని శ్లోక ది గ్లోబల్ స్కూల్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రమైన లక్ష దీపోత్సవ వేడుకను ఆధ్యాత్మికతతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్లోక చైర్మన్, అధ్యక్షుడు పి.జైపాల్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనాదేవి, అకడమిక్ డైరెక్టర్ బాలాజీ, శ్లోక పాఠశాల మెంబర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో వెలిగిన అనేక దీపాలతో ఆ ప్రాంగణమంతా దివ్య కాంతితో...