చిత్రం న్యూస్, సాత్నాల: విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సాంగ్వి, గోండుగూడ, పాఠగూడ గ్రామాలలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, అంగన్వాడీ పిల్లల్లకు పలకలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే లక్ష్యం నిర్దేశించుకొని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభాత్ రావు, మోతిరాం, గ్రామస్తులు మాధవరావు, సంపత్ రావు, సోంజి, పొచ్చిరాం, వెలదీ వసంతరావు, ఆత్రం భగవాన్ దాస్, చిత్రు, కిన్క శ్యామ్ రావు, ఇస్తారి,అర్జున్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.

