ఖాళీ ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ గోపిని కోరిన ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యవసాయశాఖ కమిషనర్ గోపిని కోరారు. గురువారం హైదరాబాద్ లో ఆయన్ను కలిసి సన్మానించారు. రైతులు పంటలపై సాంకేతిక సలహాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. ఈ రబీ సీజన్లో యూరియా, డీఎపీ వంటి ఎరువులు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు...