చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యవసాయశాఖ కమిషనర్ గోపిని కోరారు. గురువారం హైదరాబాద్ లో ఆయన్ను కలిసి సన్మానించారు. రైతులు పంటలపై సాంకేతిక సలహాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. ఈ రబీ సీజన్లో యూరియా, డీఎపీ వంటి ఎరువులు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. కౌలు రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి సిబ్బంది లోటు తక్షణమే పూరించాలన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

