చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో జగద్గురు నరేంద్ర స్వామి పాదుక రథయాత్రను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామానందచార్య సాంప్రదాయ సేవ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వామీజీ రాకతో ప్రత్యేక పూలదండలతో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి పాదుకలను పురవీధుల గుండా భాజా భజంత్రీల మధ్య భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో చేపట్టారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు.

