చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలోని శ్రీ వీరహనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తిక శుక్ల ద్వాదశి ఆదివారము రోజు పూజ ప్రారంభమై కార్తీక శుక్ల త్రయోదశి సోమవారము ఉదయం 10:21ని. లకు ఉత్తరబాద్ర నక్షత్రంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమం పూజారి చేపట్టారు. గ్రామ ప్రముఖుడు లోక ప్రవీణ్ రెడ్డి దంపతులు యజ్ఞ, హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హారతి కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ధ్వజస్తంభం కోసం తమ వంతుగా రూ.12 వేలు అందజేశారు.

