మాజీ మంత్రి హరీష్ రావుకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శ
చిత్రం న్యూస్, ముథోల్: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మరణించడంతో హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.