చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిలహాజన్ ను బోథ్ సీఐ గురుస్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ..బోథ్ సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో గంజాయి, గుడుంబా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా కృషి చేయాలని, పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో సేవలు అందించిన డి. గురుస్వామి నూతనంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు. అంతకు ముందు స్పెషల్ బ్రాంచ్ వరంగల్ లో విధులు నిర్వర్తించి, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ సీఐగా గురుస్వామి బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో నేర నియంత్రణ, ప్రజా రక్షణ, శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధతతో పని చేస్తానని సీఐ తెలిపారు.
