బోథ్ కోర్టు భవనాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న నూతన కోర్టు భవనాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోర్టు భవనాన్ని వీలైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి.మౌనిక. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు దేశ్పాండే, సెక్రటరీ పంద్రం శంకర్, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు,...