చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని తెలిపారు. సదస్సులో సైబర్ నేరాల తీరుపై వీడియో రూపంలో ప్రదర్శన ఇస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు. అదే విధంగా ప్రముఖ మెజీషియన్ సుధాకర్ మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. గ్రామస్థులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
