Chitram news
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 6:00 pm Editor : Chitram news

బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు

గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం

చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో  మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో  రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా  మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకొని  గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో  మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.