Chitram news
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 2:36 pm Editor : Chitram news

సోయాబీన్ పంట కొనుగోలుపై కలెక్టర్ కు రైతుల విజ్ఞప్తి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోలుకు సంబంధించి కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో అత్యధికంగా పండించే సోయాబీన్ పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు ₹3,900 నుండి ₹4,200 వరకు కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వ మద్దతు ధర ₹5,360గా ఉందన్నారు. రైతుల తరపున మార్క్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఈ సంవత్సరం అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. వారి వెంట రైతులు సాయిప్రసాద్, అడ్డి అనిల్ రెడ్డి, గంగం స్వామి రెడ్డి, పబ్బు స్వామి, శబ్బష్ ఖాన్, ఆస్ర వేంకన్న తదితరులు ఉన్నారు.